

అనూహ్య విజయాలతో ప్రాంతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 9 రోజుల్లోనే సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల గుజరాతీ చిత్రం ‘లాలో’ తరహాలోనే ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది.
ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో స్నేహల్ తార్డే, మోహన్ జోషి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 21న విడుదలై 1100 స్క్రీన్‌లలో ప్రారంభమైంది. మౌత్ టాక్‌తో మంచి స్పందన రావడంతో మరో 600 స్క్రీన్‌లు పెంచారు. మొదటి వీకెండ్‌లోనే రూ.5.90 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా టాప్ 10 మరాఠీ హిట్ చిత్రాల్లో చోటు సంపాదించింది. సినిమా కథలో ఒక మహిళా రైతు ఆధ్యాత్మిక అనుభవం ద్వారా జీవితం మారిపోవడం ప్రధాన అంశంగా చూపించారు. షూటింగ్ సమయంలో 33 గంటలు నిరంతరంగా పని చేసిన ఆసక్తికర సంఘటనలు కూడా బయటపడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!