

ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ తు యా మైన్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన కథనం, కట్టిపడేసే కథా నిర్మాణంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ థ్రిల్లర్ కొత్త అనుభూతిని అందిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దక్షిణాదిలో జరిగిన ప్రత్యేక ప్రదర్శనలో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూస్తేనే ఈ సినిమా అసలు ఉత్సాహం, అనుభూతి పూర్తిగా తెలుస్తుందని ఆయన ప్రశంసించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, అలాగే భానుశాలి స్టూడియోస్ తరఫున వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!