
ఓటీటీ

రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్ధమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘వడ్డీ కాసుల వాడ’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
‘బిందాస్’ తర్వాత మంచు మనోజ్, నిర్మాత అనిల్ సుంకర కాంబినేషన్ మళ్లీ కలవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఈఎంఐలు, వాయిదాల నేపథ్యంలో నడిచే కథతో రూపొందుతున్నట్లు సమాచారం. కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!