

దక్షిణాది సినీ పరిశ్రమలో అరుదైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ నవంబర్ 20న వేర్వేరు భాషల చిత్రాలతో ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్నారు. దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు, ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓం’లో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘అమరన్’ చిత్రంతో గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు దుల్కర్ తెలుగు సినిమాతో, మరోవైపు మమ్ముట్టి తమిళ చిత్రంతో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావడం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రీకొడుకుల సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!