
గాసిప్స్

నటుడు మహేశ్ బాబు బెంగళూరులో AMB మల్టీప్లెక్స్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించారు. “త్వరలో కలుద్దాం, బెంగళూరు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆసియన్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ మల్టీప్లెక్స్, మహేశ్ బాబు థియేటర్ వ్యాపారంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ నెల 16 నుంచి ఈ మల్టీప్లెక్స్‌లో చిత్ర ప్రదర్శనలు ప్రారంభమవుతాయని మహేశ్ బాబు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి డాల్బీ సినిమా అనుభవాన్ని ఈ థియేటర్లు అందించనున్నాయని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని కల్పించినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అసాధారణ కృషి చేసిన AMB టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్, అతి త్వరలోనే బెంగళూరు వాసులను కలుసుకుంటానని చెప్పారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!