

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ నిడివితో వస్తున్న ఈ కాలంలో, ప్రభాస్ మరోసారి అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటలు 9 నిమిషాలుగా ఉంది. సినిమాలోని ఒక తల నరికే సన్నివేశానికి సెన్సార్ కట్ విధించింది.
సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా, అంటే ఈ నెల 8 న రాత్రి స్పెషల్ ప్రీమియర్లు నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి కోరింది.
ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ నటిస్తుండగా, సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.



.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!