

ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ముందువరుసలో నిలుస్తుంది. మలయాళంలో చిన్నప్పుడే బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన ఆమె, తర్వాత హీరోయిన్గా ఎదిగి మలయాళం, తమిళం, తెలుగులో స్టార్ స్థానం సంపాదించింది. ఇటీవల బాలీవుడ్లో ‘మేరిజాన్’ సినిమా ద్వారా కూడా అడుగుపెట్టింది. నటిగా ఎన్నో ఏళ్లు పూర్తి చేసుకున్న కీర్తి, గత ఏడాది వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు.
కీర్తి సురేష్ తాజాగా నటించిన ‘రివాల్వర్ రీటా’ ఈ నెల 28న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.
వివాహం తర్వాత విడుదల కాబోయే మొదటి చిత్రం రివాల్వర్ రీటా అని తెలిపింది. చాలా మంది ఆమెను “మీ భర్తతో కలిసి ఎప్పుడు నటిస్తారు?” అని అడుగుతున్నారట. దానికి ఆమె నవ్వుతూ “అసలు ఆయన సినిమాకు దూరంగా ఉంటారు, నాతో కలిసి నటించే ఛాన్స్ లేదు” అన్నారు. అయితే రివాల్వర్ రీటా సినిమా మాత్రం భర్తతో కలిసి చూసారని, కానీ ఆయన ఇకపై ఇలా ముందే సినిమాలు చూడనని, థియేటర్లోనే చూస్తానని చెప్పారని తెలిపారు.
‘రివాల్వర్ రీటా’ అనేది కోలమావు కోకిల (కోకో) చిత్రానికి సీక్వెల్ కాదని ఆమె స్పష్టం చేసింది. తమిళ చిత్రమైన ‘తోడరి’లో తన నటనపై కొందరు ఎగతాళి చేసినా, అదే సినిమా చూసి మేకర్స్ ఆమెను ‘మహానటి’ కోసం ఎంపిక చేశారని, ఆ పాత్రతో తాను జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించానని గుర్తుచేసుకుంది.
అలాగే, ఒకసారి ప్రమాదకరమైన డీప్‌ఫేక్ వీడియోలో తాను మరియు సమంత ఉన్నట్లు తయారు చేయగా, అది చూసి భయపడ్డానని వెల్లడించింది. విదేశాల్లో మహిళలకు రక్షణ కొంత బాగా ఉంటుందని, మన దేశంలో కూడా అలాంటి భద్రత ఉండేలా చట్టాలు తీసుకురావాలి అని అభిప్రాయపడింది.
తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని, అందుకోసం ప్రస్తుతం తనే ఒక స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపింది. జీవితంలో కనీసం ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!