

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు, కాన్సెప్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. తాజాగా కీరవాణి మాట్లాడుతూ ‘వారణాసి’ మ్యూజికల్ ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉంటుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నాయని వెల్లడించినట్లు సమాచారం.
అయితే ఆరు పాటల విషయంలో అభిమానుల్లో కొత్త సందేహం మొదలైంది. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’తో కలిపి మొత్తం ఆరు పాటలు ఉంటాయా? లేక వాటికి అదనంగా మరో ఆరు పాటలు ఉంటాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చిత్రబృందం దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!