
సినిమాలు

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం సబ్‌స్క్రిప్షన్‌కు చివరి రోజు కావడంతో మొత్తం 6,27,61,403 షేర్లకు గాను 3,95,22,17,604 బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఐపీఓ మొత్తం 62.97 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత మదుపరుల విభాగంలో అత్యధికంగా 145 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.
సంస్థాగతేతర మదుపరుల విభాగం 73.90 రెట్లు, రిటైల్ మదుపరుల విభాగం 11.81 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. లలితా జ్యువెల్లరీ ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.1,200 కోట్లను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, షేర్ల విక్రయం ద్వారా మరో రూ.500 కోట్లను సమీకరించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!