

గత బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి ఇటీవల బహిరంగంగా మాట్లాడిన నటి అనుపమ పరమేశ్వరన్‌కు నటి అదితి శంకర్ మద్దతుగా నిలిచారు. మాజీ ప్రియుడి పేరు ప్రస్తావించకుండా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అనుపమ వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ‘వన్స్‌మోర్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి ఈ అంశంపై స్పందిస్తూ.. అనుపమ ధైర్యాన్ని, నిజాయతీని ప్రశంసించారు.
అనుపమ వ్యాఖ్యలపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చని, అయితే తాను ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా పంచుకున్నందుకు ఆమెను అభినందించాలని అదితి అన్నారు. ఎవరినీ నిందించడం లేదా కించపరచడం అనుపమ ఉద్దేశం కాదని, తన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని పేర్కొన్నారు. అనేక మంది పురుషులు, మహిళలు తీవ్రమైన మానసిక సంఘర్షణలతో కూడిన బంధాల్లో ఉంటున్నారని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా గుర్తించలేకపోతున్నారని అదితి తెలిపారు. అనుపమలా ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటం వల్ల అలాంటి వారికి తమ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, అనుపమ వ్యాఖ్యలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!