
సినిమాలు

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 95 ఏళ్ల ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు.
1950లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో షావుకారు జానకి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా పేరునే తన పేరులో భాగంగా చేసుకుని ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 400 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్న నేపథ్యంలో త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!