
జనరల్

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఫైనాన్స్ క్లియరెన్స్ సమస్యలతో విడుదల రోజు అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో మార్నింగ్, మాటినీ ప్రదర్శనలు రద్దవడంతో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ ఈ పరిస్థితిపై భావోద్వేగ వీడియో విడుదల చేస్తూ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ఎదురైన సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని, సాయంత్రం 6 గంటలకు సినిమా తప్పకుండా విడుదలవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వీడియోకు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో మద్దతు తెలుపుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!