

‘కంగువా’, ‘రెట్రో’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సూర్య తాజా చిత్రం ‘కరుప్పు’పై అందరి దృష్టి నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. విడుదల ఒక రోజు ఆలస్యమైనప్పటికీ, సినిమా తమిళంతో పాటు తెలుగు మార్కెట్లో కూడా భారీ స్పందన అందుకుంటోంది. మంచి టాక్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా సినిమా కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
మే 15న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ₹15.50 కోట్ల వసూళ్లు సాధించగా, రెండో రోజు ₹24.1 కోట్లకు చేరింది. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగి దాదాపు ₹28.50 కోట్లను అందుకున్నాయి. మూడు రోజుల్లో ఇండియాలో మొత్తం ₹68 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, ఓవర్సీస్లో మరో ₹42 కోట్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా ₹120 కోట్ల మార్క్ దాటింది. సూర్య – త్రిష కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటికంటే ‘కరుప్పు’ ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!