

ధనుష్, మమితా బైజు జంటగా రూపొందిన ‘కర’ చిత్రాన్ని కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించగా, విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధినేత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా బలమైన ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఉత్తరాంధ్రలో అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలిపారు. ‘కర’ సినిమా బిజినెస్‌లో 80% పూర్తైందని, తెలుగులో 400కి పైగా స్క్రీన్లలో, హిందీతో కలిపి 600కి పైగా స్క్రీన్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. కరస్వామి అనే పాత్ర చుట్టూ కథ తిరుగుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని తెలిపారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!