
జనరల్

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె, కఠినమైన డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ సన్నివేశాల మధ్య ప్రమాదానికి గురై, హిప్ ప్రాంతంలో టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది.
వైద్యులు కనీసం ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, అనంతరం రీహాబిలిటేషన్ చికిత్స అవసరమని సూచించారు. ఇలాంటి గాయాలు సాధారణంగా ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో మాత్రమే కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ‘రణబాలి’, ‘మైసా’ వంటి భారీ చిత్రాల షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!