

హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన కవల పిల్లలు మ్యాక్స్, ఎమ్మే గ్రాడ్యుయేషన్ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల స్కూల్ జీవితం ముగియడం, త్వరలో కాలేజీల కోసం ఇంటిని వీడబోతుండటం తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె వెల్లడించారు. గత రెండు నెలలుగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి కన్నీళ్లు వస్తున్నాయని, వారి ఇయర్బుక్ల కోసం సందేశాలు రాయడానికే రెండు రోజులు పట్టిందని తెలిపారు.
త్వరలో ఇద్దరూ వేర్వేరు కాలేజీల్లో చేరనున్నప్పటికీ, వారు తమ కలలను సాధించాలని మాత్రమే కోరుకుంటున్నానని జెన్నిఫర్ పేర్కొన్నారు. పిల్లలను స్వయంగా కాలేజీ డార్మ్లకు తీసుకెళ్లి సెటిల్ చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పారు. అయితే కొద్దిరోజుల్లో ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్లీ ఇంటికి రావాలని అనిపిస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!