

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. తన సోదరుడు అర్జున్ కపూర్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు గురవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. సోషల్ మీడియా సంస్కృతిలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ వైరల్ కావాలని చూస్తారని, అందుకోసం కొందరు సెలబ్రిటీలను కేవలం కంటెంట్‌గా ఉపయోగిస్తారని జాన్వీ పేర్కొంది. అలాంటి వార్తలు చదివినప్పుడు వాటికి వాస్తవానికి సంబంధం లేదని కూడా అర్థమవుతుందని ఆమె చెప్పింది.
ఈ తరహా నెగిటివిటీని క్షమించకూడదని, అలాంటి విషయాలను మనసుకు దగ్గరగా తీసుకోకుండా దూరంగా ఉండటం మంచిదని జాన్వీ సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ఎక్కువగా పట్టించుకోకుండా ఉండటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా జాన్వీ త్వరలోనే Ram Charan సరసన నటించిన పెద్దిచిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.








.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!