
జనరల్

యూట్యూబర్ రమానందన మరియు మధుకర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, దంపతులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా సంబంధిత అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి రమానందన, మధుకర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 420, 318(1)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. నిందితుల ఆచూకీ లభించిన వెంటనే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!