
జనరల్

గోవా బ్యూటీ ఇలియానా ‘దేవదాసు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పలువురు అగ్ర హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్న ఆమె, తరువాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో ఎంపిక చేసిన పాత్రల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని వెల్లడించింది. ఆయన చాలా సరదాగా ఉంటారని, సెట్లో ఉంటే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుందని చెప్పింది. తమ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని పేర్కొంటూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!