

మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో సంప్రదాయ దీపం వెలిగించే అంశంపై తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. గతంలో కోర్టు దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అవి అమలు కాలేదని ఆరోపిస్తూ ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది.
ఈ అప్పీల్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు అడిగారు. ధిక్కార పిటిషన్ అంశాన్ని పక్కన పెడితే, దీపం వెలిగించే ఆదేశాలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో వివరించాలని సూచించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉన్నతాధికారులతో చర్చించేందుకు సమయం కోరగా, జూన్ 22లోపు తుది వైఖరిని తెలియజేయాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!