

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై హనుమాన్ చిత్రం హంపీలోని పవిత్రమైన అంజనాద్రి బెట్ట వద్ద పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో రిషబ్ శెట్టి దంపతులు, తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇతిహాస నేపథ్యంలో రూపొందిన సూపర్ హీరో చిత్రం హను-మాన్ కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి నటిస్తుండగా, తేజ సజ్జా తన హనుమంతు పాత్రను మళ్లీ పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి కనిపించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!