

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్‌కార్డ్స్‌గా ప్రవేశించిన కంటెస్టెంట్లు షోకు కొత్త మలుపు తీసుకురావాలని భావించారు. కానీ ఫలితం అంతకు విరుద్ధంగా మారింది. ఒక్కొక్కరుగా వైల్డ్‌కార్డ్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయేషా, రమ్య మోక్ష, దువ్వాడ మాధురి బయటకు వెళ్లగా, ఈ వారం శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఓటింగ్ ప్రకారం భరణి మరియు సాయి బాటమ్‌లో ఉండగా, తక్కువ ఓట్లు రావడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఎలిమినేషన్ ఎపిసోడ్ ఈ రాత్రి ప్రసారం కానుంది.
సాయి 35వ రోజు ఇంట్లోకి ప్రవేశించి, 63వ రోజున బయటకు వచ్చాడు. మొత్తం 28 రోజుల ప్రయాణంలో ఆయన ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. మరోవైపు రాము రాథోడ్ స్వచ్ఛందంగా హోమ్‌సిక్ కారణంగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఈ వారం అనుకోకుండా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పుడు సాయి, రాము ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం 11 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!