

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయి డిజిటలీకరణను వేగవంతం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, మార్కెట్ యార్డుల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు, ప్రత్యేక తనిఖీ బృందాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిగా ఆటోమేషన్ చేయాలని, ఆగస్టు నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేయాలని, మార్కెట్ యార్డుల్లో వాహనాల నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!