

దేశంలో పప్పు దినుసులు, వంట నూనెల కొరతను తగ్గించాలంటే పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లోక్ భవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎల్‌నినో ప్రభావంపై నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన గవర్నర్, కమిటీ నివేదికను స్వీకరించి వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై చర్చించారు.
దేశం ప్రతి ఏడాది పప్పు దినుసుల దిగుమతులకు సుమారు ₹34,054 కోట్లు, వంట నూనెల దిగుమతులకు సుమారు ₹1.61 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగును విస్తరించడం ద్వారా ఈ కొరతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హార్టికల్చర్, కూరగాయల సాగు అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, ఎల్‌నినో ప్రభావంపై నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను కూడా అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!