
సినిమాలు

తెలంగాణ క్రీడా విధానం–2025లో భాగంగా రాష్ట్రంలో సురక్షితమైన, సమ్మిళితమైన, క్రీడాకారుల కేంద్రిత క్రీడా వాతావరణాన్ని నిర్మించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్రీడాకారుల శారీరక, మానసిక భద్రతను కాపాడుతూ, వారు పూర్తి సామర్థ్యంతో ప్రతిభ కనబర్చేలా సమగ్ర సేఫ్‌గార్డింగ్ విధానాన్ని అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో 120 మందికి పైగా కోచ్‌లతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. యునెస్కో, యుగాంతర్ సంస్థల నిపుణులు క్రీడాకారుల సంక్షేమం, వేధింపుల నివారణ, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు, గౌరవం, భద్రత, సమ్మిళితత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సోమవారం క్రీడా నిర్వాహకులు, ఇతర భాగస్వామ్య వర్గాలతో మరో సమావేశం నిర్వహించనున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!