

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రం 45 వ వార్షికోత్సవంలో నిర్వహించిన ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం చుట్టుముడతారని, కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తెలిపారు. గురూజీ ఆహ్వానం మేరకు వేదికపైకి వెళ్లినప్పుడు వేలాది మంది ఉన్నప్పటికీ ఎవరూ తనను గుర్తించలేదని, ఆ క్షణంలో తనలోని అహంకారం పూర్తిగా అణిగిపోయిందని చెప్పారు.
తన జీవితంలో ఎన్నో ప్రముఖులను కలిసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మొత్తం గురూజీపైనే ఉందని, స్టార్డమ్ తాత్కాలికమైనదైనా గురువుల స్థానం శాశ్వతమని అన్నారు. ఈ శరీరం లేకపోయినా గురువుల ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. రాజైనా గురువు ముందు నమస్కరించాల్సిందేనని ఒక కథ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరియు పలువురు మతపెద్దలు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!