

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మనోజ్ బాజ్‌పేయి తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గత కొన్నేళ్లుగా నటనకు వీడ్కోలు పలకాలనే ఆలోచన తనకు పలుమార్లు వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే ప్రతిసారి అలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో కొత్త కథలు, సవాలుతో కూడిన పాత్రలు తన ముందుకు రావడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందన్నారు. నటనను కేవలం వృత్తిగా కాకుండా ఒక కళగా భావించే తనకు మంచి పాత్రలను తిరస్కరించడం కష్టమని పేర్కొన్నారు.
గంభీరమైన, భావోద్వేగ తీవ్రత ఉన్న పాత్రలు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని మనోజ్ బాజ్‌పేయి తెలిపారు. అలాంటి పాత్రలు చేసిన తర్వాత మానసిక అలసట, మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే కథల్లో భాగం కావాలనే కోరిక తనను మళ్లీ కెమెరా ముందుకు తీసుకువస్తోందని చెప్పారు. డబ్బు కోసం కాదు, మంచి సినిమాలపై ఉన్న ప్రేమ కోసమే ఇంకా నటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!