26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ

Writer: Shivani K 02:20 PM, 26 అక్టోబర్, 2026
మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ

తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించాలని తెలంగాణ బృందం కోరింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని, ప్రతిపాదిత నిర్మాణం అవసరాన్ని వివరించారు. గతంలో 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి ఒప్పందం కుదిరినా, ఆ ఎత్తుతో తెలంగాణకు అవసరమైన స్థాయిలో నీటిని వినియోగించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రాణహిత నది జలాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమని, ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర బృందం విజ్ఞప్తి చేసింది. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించినా మహారాష్ట్రలో ముంపు సమస్య పరిమితంగానే ఉంటుందని, సుమారు 2,300 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు వివరించారు. నిర్మాణ ఎత్తును 150 మీటర్లకు తగ్గిస్తే ముంపు విస్తీర్ణం 1,000 ఎకరాల్లోపే ఉంటుందని తెలిపారు. వ్యాప్కోస్‌, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాలు, ప్రీ-ఫీజిబిలిటీ నివేదికతో పాటు ఇతర సాంకేతిక అంశాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి బృందం కోరింది. ఈ అధికారిక చర్చలకు ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడిగా సమావేశమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు

అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ

ట్యాగ్లు
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టురేవంత్‌రెడ్డిదేవేంద్ర ఫడణవీస్ఉత్తమ్‌కుమార్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంమహారాష్ట్ర ప్రభుత్వంప్రాణహిత నదినీటిపారుదల ప్రాజెక్టుబ్యారేజీ నిర్మాణంఅంతర్రాష్ట్ర జల వివాదాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..
సినిమాలు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన
జనరల్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
రాజకీయాలు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర
క్రీడలు

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
జనరల్

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఓటీటీ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం
బిజినెస్

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం
సినిమాలు

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!