

ఒకప్పుడు తమ డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రభుదేవా, సిమ్రాన్ మరోసారి ఒకే తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 27 ఏళ్ల విరామం తర్వాత ఈ హిట్ జోడీ ఓ కొత్త ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ‘కమల్ శ్రీదేవి’ అనే క్లాసిక్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. క్రిష్ణానంద్ కొట్టారపట్టు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిథున్ జై శంకర్, మెహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
జయాన్ ఫిల్మ్స్, ఎమ్‌ఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సౌందర్య రజినీకాంత్, మగేష్ రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన, మనసుకు హత్తుకునే అనుభూతిని అందించేలా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా గురించి స్పందించిన సిమ్రాన్, ఇది తనకు కొత్త ప్రయాణమని, ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు. ‘కమల్ శ్రీదేవి’ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రేక్షకులు కూడా ఈ సినిమా అనుభూతిని పొందేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!