

ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పోరాట సన్నివేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రసంగం అనంతరం హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ‘బాహుబలి’లోని పోరాట సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన చిత్రాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అమరేంద్ర బాహుబలి పోరాడే సన్నివేశాన్ని ఇరాన్ వైఖరితో పోలుస్తూ కాన్సులేట్ ఈ పోస్టును రూపొందించింది. ఈ పోలికతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలు ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ కాన్సులేట్ చేసిన ఈ ప్రస్తావనతో మరోసారి ‘బాహుబలి’ సన్నివేశం వార్తల్లో నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!