

ప్రసిద్ధ గాయకుడు, ఇండియన్ ఐడల్ మూడవ ఎడిషన్ విజేత ప్రశాంత్ తమాంగ్ గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. ఆయన మరణాన్ని స్నేహితుడు, ఇండియన్ ఐడల్ సహ పోటీదారు భవేన్ ధనాక్ ధృవీకరించారు. అకస్మాత్తుగా ప్రశాంత్ ఈ లోకాన్ని విడిచిపోవడం తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. ప్రశాంత్ కొంతకాలంగా ఢిల్లీలో నివసిస్తున్నారని, ఇండియన్ ఐడల్ షో సమయంలో తామిద్దరం రూమ్‌మేట్స్‌గా ఉన్నామని భవేన్ గుర్తు చేసుకున్నారు. ఇండియన్ ఐడల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందకముందు ప్రశాంత్ పశ్చిమ బెంగాల్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు.
ప్రశాంత్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఇండియన్ ఐడల్ వేదికగా ప్రతిభను చాటుకుని దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని ప్రశంసించారు. డార్జిలింగ్‌కు చెందిన ప్రశాంత్ పోలీస్ శాఖలో సేవలందించి రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారని తెలిపారు. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలో ప్రశాంత్ కనిపించారు. గుర్ఖాల సంస్కృతిని ప్రతిబింబించే పాటలతో ఆయన విశేషమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!