

హీరో సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర బృందం హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించింది. మహేంద్రగిరి నేపథ్యంలో వారాహి మాత దివ్యశక్తి చుట్టూ సాగే ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో మంచి స్పందనను అందుకుంది. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్, దర్శకుడు, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మాతలు కలిపు మధు, లక్ష్మణ్ మంచి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!