

భారతీయ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. కమల్ హాసన్‌తో ఆయన తెరకెక్కించిన భారతీయుడు చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ పరాజయం తర్వాత కూడా భారతీయుడు 3పై ఆసక్తి తగ్గలేదు. కథలోని ప్రధాన అంశాలను మూడో భాగంలో మరింతగా చూపించవచ్చనే అభిప్రాయాలు కూడా అభిమానుల్లో వినిపించాయి.
తాజాగా భారతీయుడు 3కు సంబంధించి మేకర్స్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. కమల్ హాసన్, శంకర్ కలయికలో మూడో భాగం పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంకా కొంత చిత్రీకరణతో పాటు వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయి, సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే దానిపై ఇంకా అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు. శంకర్‌కు ఈ సినిమా కీలకమైన కంబ్యాక్‌గా నిలుస్తుందా, భారతీయుడు 3తో అభిమానుల అంచనాలను అందుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!