

నటుడిగా, గాయకుడిగా, గేయరచయితగా తన ప్రతిభను చాటుకున్న రామ్ పోతినేని ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తన 23వ చిత్రం ‘RAPO23’ను స్వయంగా తెరకెక్కిస్తున్నట్లు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుండగా, రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ ‘వీర’ పాత్రలో కనిపించనున్నారు. లెదర్ జాకెట్‌తో వెనకవైపు నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఒంటరి తోడేలు కథ ఇది’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ కథను కూడా రామ్ స్వయంగా సిద్ధం చేసినట్లు సమాచారం.

జూన్‌లో షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. మరోవైపు, హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా రామ్ ఉత్తరాదిలో భారీ క్రేజ్ సంపాదించారు. యూట్యూబ్‌లో 2 బిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సృష్టించారు. ఆయన సినిమాల్లో అనేకం 100 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో చేరాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ రూ.65 కోట్లకు పైగా వసూలు చేసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చిన్న వయసులోనే ‘ఆడయాళం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!