

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ గ్లింప్స్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానుల్లో మరోసారి సందడి మొదలైంది. రుద్రుడి పాత్రలో మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని భారీ ఎద్దుపై స్వారీ చేస్తున్న విజువల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ చూడని డివైన్ మాస్ లుక్‌లో మహేష్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ ప్రీ గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రీ గ్లింప్స్ విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ఇవ్వాలని అభిమానులు రాజమౌళి టీమ్‌ను కోరుతున్నారు. సుమారు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారతీయ పురాణ గాథల అంశాలను గ్లోబల్ అడ్వెంచర్ కథాంశంతో మేళవిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు VFX పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!