

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దర్శకుడు హార్దిక్ గజ్జర్ తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు ₹60 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందినట్లు సమాచారం. అయితే విడుదలై 10 రోజులు పూర్తయ్యే సరికి సినిమా మొత్తం పెట్టుబడిలో కేవలం 28.36 శాతం మాత్రమే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భక్తి, హిందుత్వ అంశాలతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఈసారి ఆ ఫార్ములా పూర్తిగా పనిచేయలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఏడాది సంచలన విజయాన్ని అందుకున్న ‘మహావతార్ నరసింహ’ తరహాలో ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని భావించారు. గ్రాండ్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నప్పటికీ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకోవడంలో సినిమా విఫలమైందని టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లు కూడా ప్రధానంగా భక్తి అంశాల వల్లే సాధ్యమయ్యాయని చెబుతున్నారు. మంచి కథనం, భావోద్వేగ అనుసంధానం ఉంటే సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్లేదని విశ్లేషిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!