

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై, తొలి రోజు రూ.84 కోట్లు వసూలు చేస్తూ ఘన విజయాన్ని సాధించింది. ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్ లో అనిల్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇళయరాజా పాటలను వాడుకోవడం సులభం అని అనిల్ తెలిపారు. అన్ని అనుమతులు తీసుకొని, లీగల్ సమస్యల్లేకుండా పాటలను ఉపయోగించామన్నారు. నిర్మాత సాహు గారపాటి అంచనా ప్రకారం, సినిమా మొత్తం కలెక్షన్ రూ.400–500 కోట్లు వరకు ఉండవచ్చని చెప్పారు. మహిళలకు ఇబ్బంది పడే సీన్ గురించి అనిల్ హాస్యంగా చెప్పారు – “అవసరమైతే నేను జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను” అని. ఆ సీన్ ఎవరికీ హాని చేయడం కోసం కాదు, చట్టాలు కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతున్నాయని చూపించటమే ఉద్దేశం అని స్పష్టం చేశారు.
చిరంజీవి పారితోషికం సినిమా బడ్జెట్‌ను, ఆయన స్థాయిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించబడిందని అనిల్ తెలిపారు. సుస్మిత కొణిదెల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కి కూడా సినిమా చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఆయనకున్న వెసులుబాటు బట్టి, కచ్చితంగా చూపిస్తాం, అని తెలిపారు. వెంకటేష్, నయనతార, బాలకృష్ణతో పనిచేయడం ప్రత్యేక అనుభవమని, నాగార్జునతో భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్ట్ జరగవచ్చని అనిల్ చెప్పారు. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, నాకూ చిరంజీవి గారికి ఒక మినీ ఛాలెంజ్ జరిగింది. సినిమా ప్రారంభం కాకముందు ఆయన్ను కలిసినప్పుడు ‘మనం త్వరగా మొదలు పెట్టాలి. ఓపిగ్గా ఒక కథ వెతుకు. నువ్వు చేయగలవా?’ అని చిరు అడిగారు. నిజంగా ఆయన మాటలను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని, 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశా, అని చెప్పారు. రాజమౌళి గారితో నన్ను పోలుస్తున్నారు అంటే నాకు హ్యాపీగానే ఉంది. అది నాకు బిగ్ అచీవ్మెంట్. రాజమౌళి ఐకానిక్ డైరెక్టర్. నన్ను ఆయనతో పోల్చుకుని నా స్థాయి పెంచుకోవాలని నేను అనుకోను. ఆయన స్థాయి తగ్గించాలని కూడా అనుకోను అని కూడా చెప్పారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!