
క్రీడలు

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కఠిన అనుభవాల గురించి మాట్లాడింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తర్వాత ఎదురైన పరిస్థితులు తనను పూర్తిగా మార్చేశాయని, జీవితాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునేలా చేశాయని తెలిపింది. ఆ కష్టకాలం తన వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తీర్చిదిద్దిందని పేర్కొంది.
గత నాలుగేళ్లుగా థెరపీ తీసుకుంటున్నానని, ఆ ప్రక్రియ తనను మానసికంగా బలపరిచిందని రియా వెల్లడించింది. పాత బాధలు భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా థెరపీ ఎంతో సహాయపడిందని చెప్పింది. ప్రేమపై, జీవితంపై తనకు ఇంకా నమ్మకం ఉందని, మిగతా యువతుల్లాగే సాధారణంగా జీవిస్తూ తన కలలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నానని భావోద్వేగంగా వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!