

సుబ్బు, ప్రియాంక హీరో – హీరోయిన్లుగా నటిస్తున్న భక్తి చిత్రంగా రూపొందుతున్న “దక్షిణ కాళీ” సినిమాలో హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యవాణి మీసాల ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకుడు తోట కృష్ణ డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, అమ్మవారి మహిమలను తెలిపేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని అన్నారు.
నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ, అమ్మవారి దయ వల్లే ఈ సినిమా సాధ్యమైందని, దర్శకుడు, నటీనటులు ఎంతో అంకితభావంతో పనిచేశారని తెలిపారు. త్వరలో మూడు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ, ఈ సినిమాకు నిజమైన హీరో నిర్మాత సత్యవాణి గారేనని, ఆమె కష్టపడి చిత్రాన్ని నిర్మించారని అన్నారు.
నటుడు అఫ్సర్ ఆజాద్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
హీరో సుబ్బు మాట్లాడుతూ, అమ్మవారి దయ వల్లే ఈ సినిమాలో అవకాశం లభించిందని, మంచి సందేశంతో కూడిన పాత్రలో నటించానని చెప్పారు. మహిళల శక్తిని ఈ సినిమా చూపిస్తుందని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!