

అభిషేక్ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై చరణ్ బాలాజీ దర్శకత్వంలో పరకోటి బాలాజీ నిర్మిస్తున్న వేటగాడు (వీడు క్రాక్ గాడు) చిత్రం నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దాసరి పద్మ రేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా, నిర్మాత జెవి మోహన్ గౌడ్ కెమెరా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత చందన రాజు, నటుడు కృష్ణ తేజ తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చిత్రంలో బాలాజీ, అంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లర్ మంజు, సుమన్, నాగ మహేష్, బాలచంద్ర, హర్ష వర్దిని, కోటేశ్వర రావు, దేవి కుమారి, గీత రెడ్డి, పద్మ, ఫణి, శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తంగిరాల ఆనంద కృష్ణ కథను అందించగా, నాగేష్ వర్మ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిరణ్ తేజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బుస్సా బాలరాజు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!