

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ప్రతి జిల్లాలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆదివారం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వివిధ నగరపాలక సంస్థల్లో 118 మంది కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో 756 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పునేఠా వెల్లడించారు. పోలింగ్ నిర్వహణ కోసం 13,504 మంది ప్రిసైడింగ్ అధికారులను విధుల్లో నియమించినట్లు తెలిపారు. నామినేషన్ల సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!