

నటి కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ తీసుకోవాలంటూ ఓ ప్రయాణికుడు తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె తాజాగా వెల్లడించారు. అభిమానులతో ఫొటోలు దిగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వ్యక్తిగత హద్దులను దాటి ప్రవర్తిస్తే ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. మిలాన్ నుంచి భారత్‌కు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి సెల్ఫీ అడిగాడని కీర్తి తెలిపారు. అతడు సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉండటంతో కొద్దిసేపు ఆగాలని సూచించినా, వినకుండా వెంటనే ఫొటో దిగాలని పట్టుబట్టినట్లు వివరించారు. ఈ పరిణామంతో తన భర్త ఆంటోనీ తట్టిల్ కూడా అసహనానికి గురయ్యారని, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అభిమానులందరూ ఇలాగే ప్రవర్తించరని, కొందరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారని కీర్తి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!