31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు

Writer: Nithish 04:58 PM, 31 అక్టోబర్, 2026
సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో (Sovereign Gold Bonds) పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు అందుతున్నాయి. ముఖ్యంగా 2021లో ఈ బాండ్లను కొనుగోలు చేసిన మదుపర్లు తమ పెట్టుబడిపై దాదాపు 200 శాతానికి పైగా రాబడి పొందే అవకాశం కలిగింది. 2021-22 సిరీస్‌ VII గోల్డ్‌ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని నవంబర్‌ 2గా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ బాండ్ల రిడెంప్షన్‌ ధరను ఒక్కో గ్రాముకు రూ.14,167గా నిర్ణయించింది. అప్పట్లో ఆఫ్‌లైన్‌లో గ్రాము బంగారాన్ని రూ.4,765కు, ఆన్‌లైన్‌లో రూ.50 డిస్కౌంట్‌తో రూ.4,715కు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ లెక్కన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గ్రాముపై రూ.9,452 వరకు లాభం వచ్చినట్లవుతుంది. ప్రారంభ పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

సావరీన్‌ గోల్డ్‌ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. అయితే ఐదేళ్లు పూర్తయిన తర్వాత మదుపర్లు ముందస్తు ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గడువు ముగియకముందే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకునే వారి కోసం ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రీమెచ్యూర్‌ రిడెంప్షన్‌ తేదీలను ప్రకటిస్తుంది. రిడెంప్షన్‌ ధరను నిర్ణయించేందుకు సంబంధిత తేదీకి ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌ అసోసియేషన్‌ (IBJA) ప్రకటించిన బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో నమోదైన ధరల ఆధారంగా ప్రస్తుత రిడెంప్షన్‌ విలువను నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీగా పెరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాలు

భారీగా పెరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

ట్యాగ్లు
సావరీన్‌ గోల్డ్‌ బాండ్లుపసిడి బాండ్లుబంగారం పెట్టుబడులుఆర్‌బీఐరిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగోల్డ్‌ బాండ్‌ రిడెంప్షన్‌ముందస్తు ఉపసంహరణబంగారం ధరపెట్టుబడిదారులుఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ
క్రీడలు

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌
జనరల్

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన
టెక్నాలజీ

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన

సంజయ్‌ గుప్తా కలను నెరవేరుస్తా.. ‘కాంటే 2’పై సంజయ్‌ దత్‌ కీలక హామీ
సినిమాలు

సంజయ్‌ గుప్తా కలను నెరవేరుస్తా.. ‘కాంటే 2’పై సంజయ్‌ దత్‌ కీలక హామీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55 ప్రోమో 1: అనూహ్య ట్విస్ట్‌.. ఎనిమిదో వారం ఝాన్సీ ఎలిమినేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55 ప్రోమో 1: అనూహ్య ట్విస్ట్‌.. ఎనిమిదో వారం ఝాన్సీ ఎలిమినేషన్‌?

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
జనరల్

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా
జనరల్

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ
జనరల్

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం
జనరల్

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు
జనరల్

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
జనరల్

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!