

ఓట్ల చోరీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు చేపడుతున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్ష నేతలు బహిరంగ ‘ప్రజా అభిశంసన’ (మాక్ ఇంపీచ్‌మెంట్) కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ మాక్ పార్లమెంట్ సమావేశం జరిగింది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
2014 నుంచి అధికారాన్ని నిలుపుకోవడానికి భాజపా కుట్రలు చేస్తోందని ఖర్గే ఆరోపించారు. సీఈసీకి రక్షణ కల్పించే 2023 చట్టాన్ని అడ్డుపెట్టుకుని జ్ఞానేశ్ కుమార్ ఓట్ల తొలగింపు, చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సీఈసీకి కల్పిస్తున్న రక్షణ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదని వ్యాఖ్యానించారు. 2023 చట్టాన్ని రద్దు చేయడం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం, ఎస్‌ఐఆర్‌ను తక్షణమే నిలిపివేసి తొలగించిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించడం, ఎన్నికలను పేపర్ బ్యాలెట్లతో నిర్వహించడం తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు. సీఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమర్పించిన నోటీసులను ఉభయ సభల్లో స్వీకరించకపోవడంతో పార్లమెంటు వెలుపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందని ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!