
క్రీడలు

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం వికాస్ పాండే దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ధ్రువ్ రాథీ రూపొందించిన ‘BJP IT Cell Part 2’ వీడియో తన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ వికాస్ పాండే కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో గతంలో జారీ చేసిన వారెంట్ ఆస్ట్రియాలోని తప్పు చిరునామాకు వెళ్లడంతో అమలు కాలేదు. దీంతో తాజాగా ధ్రువ్ రాథీ గురుగ్రామ్ చిరునామాకు వారెంట్ పంపాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 23న జరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!