

నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. కొత్త కథాంశంతో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా రితికా నాయక్ నటిస్తోంది. సంగీత బాధ్యతలను సురేష్ బొబ్బిలి నిర్వహిస్తుండగా, సినిమాటోగ్రఫీని అనిత్ మదాడి చేపట్టారు. ఆర్ట్ డైరెక్షన్‌ను జానీ షేక్ చూసుకుంటున్నారు. ఈ నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పూజా కార్యక్రమాల ఫోటోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!