

వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సోమేష్ నిర్మాతగా, శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆత్మకథ - యాన్ అన్ టోల్డ్ స్టోరీ’. ఈ చిత్ర టైటిల్ మరియు ట్రైలర్‌ను సినీ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు. హీరోగా జెమిని సురేష్, హీరోయిన్‌గా రూప నటించగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, బలగం విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నటుడు కెవి ప్రదీప్, నటి కరాటే కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తక్కువ బడ్జెట్‌లో కుటుంబ సభ్యుల సహకారంతో సినిమాను పూర్తి చేశామని తెలిపారు. నటుడు జెమిని సురేష్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత హీరోగా అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్ర కథ, టైటిల్ ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. కామన్ మ్యాన్ భావోద్వేగాలు, భయం, వినోదంతో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం తెలుగు సహా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!