

మాస్ హీరో గోపిచంద్ మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు సంకల్ప్ రెడ్డి కలసి ఒక భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా – #Gopichand33 ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.గోపిచంద్ కెరీర్లో కథ, స్థాయి, విజువల్ రేంజ్ పరంగా ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.ప్రస్తుతం సినిమా యూనిట్ ఒక మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఇది ఇంటర్వెల్ బ్లాక్ గా ఉండబోతోంది. వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా, మొదటిసారిగా రూపొందించిన ప్రత్యేక సీక్వెన్స్ అని సమాచారం.
ఈ చిత్రంలో గోపిచంద్‌తో పాటు ప్రధాన నటీనటులు షూట్లో పాల్గొంటున్నారు.‘గోపిచంద్33’ కథ భారత చరిత్రలో మరచిపోయిన ఒక అధ్యాయాన్ని తిరిగి తెరమీదకు తీసుకువస్తుంది. ఇందులో గోపిచంద్ ఒక యోధుడి పాత్రలో పవర్ఫుల్, ఎమోషనల్ మరియు యాక్షన్‌తో నిండిన రోల్లో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్ మరియు గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి.

.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!