
క్రీడలు

భారత విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 30తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ నిల్వలు 1.269 బిలియన్ డాలర్లు తగ్గి 719.748 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా 5.011 బిలియన్ డాలర్ల మేర నిల్వలు తగ్గాయి.
సెప్టెంబర్ 4న భారత్ విదేశీ మారక నిల్వలు 785.706 బిలియన్ డాలర్లతో గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. అప్పటి నుంచి నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి విలువపై ఒత్తిడి పెరగకుండా ఆర్బీఐ విదేశీ మారక మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోందని, ఈ జోక్యం కూడా నిల్వల తగ్గుదలకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!