

హాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ భారతీయ థియేటర్లలో ఒకరోజు ముందుగానే విడుదల కానుంది. ఈ చిత్రం భారత్‌లో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అమెరికాలో డిసెంబర్ 18న విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ స్టూడియోస్‌కు చెందిన ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!